Share News

అమిత్ షాకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు

ABN , Publish Date - Oct 22 , 2026 | 09:02 AM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత, ఐక్యత కోసం అమిత్ షా చేస్తున్న నిరంతర కృషిని వారు ప్రశంసించారు.

అమిత్ షాకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు
Amit Shah Birthday

అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత, ఐక్యత కోసం అమిత్ షా చేస్తున్న నిరంతర కృషిని వారు ప్రశంసించారు. ఆయన నాయకత్వం, దేశం పట్ల అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..

ఈ సందర్భంగా అమిత్ షా బలమైన నాయకత్వాన్ని, దేశ భద్రత కోసం ఆయన చేస్తున్న అవిశ్రాంత కృషిని సీఎం చంద్రబాబు కొనియాడారు. దేశ భద్రత, ఐక్యత కోసం ఆయన చూపుతున్న నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అమిత్ షా ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, దేశ సేవలో మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.


అమిత్ షా లక్షలాది మందికి స్ఫూర్తి: మంత్రి లోకేశ్..

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచాలన్న ఆయన సంకల్పం, సమైక్య భారత్ కోసం చేస్తున్న నిరంతర కృషి లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమిత్ షా అందిస్తున్న నిరంతర సహకారానికీ రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. స్కార్పియో ఢీకొని నలుగురు భవానీ భక్తుల మృతి

జగన్‌ నైజం బట్టబయలు!

Updated Date - Oct 22 , 2026 | 09:02 AM