కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. స్కార్పియో ఢీకొని నలుగురు భవానీ భక్తుల మృతి
ABN , Publish Date - Oct 22 , 2026 | 07:32 AM
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం ఢీకొని ఐదుగురు భవానీ భక్తులు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కాకినాడ: జిల్లాలో ఇవాళ (గురువారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం ఢీకొని ఐదుగురు భవానీ భక్తులు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లా డెంకాడ నుంచి భవానీ భక్తులు బస్సులో విజయవాడకు బయలుదేరారు. అయితే, కత్తిపూడిలోని సత్తిబాబు పలావ్ సెంటర్ సమీపంలో బస్సు బ్రేక్డౌన్ అయింది. దీంతో టీ తాగేందుకు వారంతా వాహనం నుంచి దిగారు.
ఐదుగురు భక్తులు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన స్కార్పియో వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను సిరిగిడి ఎర్రయ్య (35), తంలింగాల సీతారాం (36), తాటిపూడి వరప్రసాద్ (36), బోనుల రమణ (52)గా గుర్తించారు. ఒకే ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడంతో విషాదం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి
అభ్యర్థుల తుది జాబితా 25 వరకు ఆపండి
100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్