డిప్యూటీ సీఎం చొరవతో మస్కట్ నుంచి స్వగ్రామానికి షెహనాజ్
ABN , Publish Date - May 09 , 2026 | 12:21 PM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీకి చెందిన మహిళ మస్కట్ నుంచి క్షేమంగా స్వగ్రామానికి చేరుకుంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షెహనాజ్ కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా మస్కట్‌కు వెళ్లి చిత్ర హింసలకు గురైంది.
అన్నమయ్య జిల్లా, మే 9: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీకి చెందిన మహిళ మస్కట్ నుంచి క్షేమంగా స్వగ్రామానికి చేరుకుంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షెహనాజ్ కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా మస్కట్‌కు వెళ్లి చిత్ర హింసలకు గురైంది. తనకు జీతం ఇవ్వడం లేదని, వేధింపులకు గురిచేస్తున్నారంటూ భర్తకు వీడియో కాల్ చేసి చెప్పింది. తనను రక్షిచాలంటూ డిప్యూటీ సీఎం పవన్‌ను వేడుకుంది. షెహనాజ్ బాధలు విన్న వెంటనే డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. మహిళను స్వగ్రామానికి రప్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులకు ఆదేశించారు. ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి చొరవతో షెహనాజ్ స్వగ్రామానికి చేరుకుంది.
కేవలం ఐదు రోజుల్లోనే మస్కట్ నుంచి మహిళను స్వగ్రామానికి డిప్యూటీ సీఎం పేషీ అధికారులు చేర్చారు. మస్కట్ నుంచి ముంబైకి అటు నుంచి విజయవాడకు వాల్మీకిపురం మహిళ షెహనాజ్ చేరుకుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పేషీ అధికారులు.. మహిళకి రూ 30,000 నగదు, చీర బహూకరించి సురక్షితంగా స్వగ్రామానికి పంపించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి షెహనాజ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. తనను సమస్యల నుంచి రక్షించి స్వగ్రామం చేర్చడంతో పాటు ఆర్థిక సహాయం అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపింది.
ఇవి కూడా చదవండి...
విశాఖ కైలాసగిరిపై భారీ త్రిశూలం ప్రారంభం
విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News