Share News

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి

ABN , Publish Date - May 09 , 2026 | 11:47 AM

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి
Suvendu Adhikari Oath Ceremony

కోల్‌కతా, మే 9: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్, అశోక్ కిర్టానియా, నిశిత్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.


మమతాపై గెలుపు..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. బీజేపీ 207 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 80 సీట్లకే పరిమితం అయింది. సువేందు అధికారి రెండు చోట్ల పోటీ చేశారు. నందిగ్రామ్, భవానీపూర్ నుంచి ఆయన బరిలో నిలిచారు. భవానీపూర్‌ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావటం విశేషం. సువేందు భవానీపూర్‌లో మమతాపై 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు.


ఇవి కూడా చదవండి

మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో విచారణ వేగవంతం..

కాలేజీ విద్యార్థుల కోసం తానా స్కాలర్ షిప్ వెబినార్ విజయవంతం

Updated Date - May 09 , 2026 | 01:18 PM