Share News

సీఎం చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:39 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా వెళ్లారు. ఎటువంటి భద్రతా, కాన్వాయ్ లేకుండా ఒంటరిగానే సీఎం నివాసానికి జనసేనాని వచ్చారు.

సీఎం చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
CM Chandrababu And Deputy CM pawan kalyan

అమరావతి, అక్టోబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా వెళ్లారు. ఎటువంటి భద్రతా, కాన్వాయ్ లేకుండా ఒంటరిగానే సీఎం నివాసానికి జనసేనాని వచ్చారు. తన వాహనాన్ని డ్రైవర్ నడుపుతుండగా కారులో చంద్రబాబు నివాసానికి పవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. సుమారు అరగంట పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు, రెబల్స్ బెడద, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఇరువురి భేటీ జరిగినట్లు సమాచారం. పట్టణ స్థానిక ఎన్నికలు వాయిదాపై కూడా చర్చ చర్చించినట్లు తెలుస్తోంది.


అలాగే, ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న ఫేక్ ప్రచారంపై కూడా చంద్రబాబు, పవన్ చర్చించినట్లు సమాచారం. ఇటువంటి ఫేక్ ప్రచారంపై ఇప్పటికే సైబర్ క్రైమ్‌కు డిప్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేశాయి. వెంటనే FIR నమోదు చేసి బాధ్యులు ఎవరో తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది. గత రాత్రి పట్టణ స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు, ఎన్నికల కమిషన్ చర్యలపై చంద్రబాబు, పవన్, మాధవ్ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నేతలు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం గొడ్డలి పార్టీకి ‌లేదు: బోండా ఉమ

విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2026 | 12:52 PM