Share News

స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్‌తో పూర్తి భరోసా.. కొరియా పెట్టుబడిదారులకు లోకేశ్ హామీ

ABN , Publish Date - Jul 09 , 2026 | 10:17 AM

పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఐదోరోజు పర్యటనలో భాగంగా సియోల్‌లో కియా మోటార్స్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి సమావేశమయ్యారు.

స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్‌తో పూర్తి భరోసా.. కొరియా పెట్టుబడిదారులకు లోకేశ్ హామీ
Minister Nara Lokesh

దక్షిణ కొరియా, జులై 9: పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఐదోరోజు పర్యటనలో భాగంగా సియోల్‌లో కియా మోటార్స్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రం విస్తరించాలని కోరారు. పీబీవీ వాహనాలతో సహా ఈవీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విశాఖ సమీపంలో సీకేడీ అసెంబ్లీ, ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీ కాంపోనెంట్లు, బ్యాటరీ సిస్టమ్‌ల తయారీ కేంద్రం ప్రతిపాదనను కియా ముందు ఉంచారు. ఈవీ పవర్‌ట్రెయిన్ టెస్టింగ్, వెహికల్ హోమోలోగేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతపురం కియా ప్లాంట్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కియా మోటార్స్ ప్రతినిధులు వెల్లడించారు.


కొరియా విదేశాంగ ఉపమంత్రిలో లోకేశ్ భేటీ

సౌత్ కొరియా విదేశాంగ ఉపమంత్రి సిసిలియా చుంగ్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. కొరియన్ పెట్టుబడిదారులకు నమ్మకమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఈ సందర్భంగా లోకేశ్ తెలిపారు. ఏపీ 3ఎస్ విధానం పెట్టుబడిదారులకు రక్షణ కవచమని చెప్పుకొచ్చారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్‌తో పరిశ్రమలకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏపీ - కొరియా ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొరియాతో కలిసి సంయుక్త శిక్షణా అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, టూరిజంలో కొరియన్ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. విశాఖ-బుసాన్/ఇంచియాన్ మధ్య ప్రత్యక్ష విమాన సౌకర్యం, ఏపీ యూనివర్సిటీల్లో కొరియన్ భాషా కేంద్రాల ఏర్పాటుకు మంత్రి విజ్ఞప్తి చేశారు. పోర్టుల సామర్థ్యంతో ఎగుమతులకు ఏపీ ఉత్తమ కేంద్రంగా చెప్పుకొచ్చారు. కొరియా- ఏపీ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

యూట్యూబర్ జోసఫ్ రావణ్ బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్

బస్ కోసం వేచి చూస్తున్న మహిళలపైకి దూసుకెళ్లిన బొలెరో

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 10:46 AM