Share News

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి.. మంత్రులకు లోకేశ్ పిలుపు

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:50 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులకు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈరోజు కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో లోకేశ్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి.. మంత్రులకు లోకేశ్ పిలుపు
Minister Nara Lokesh

అమరావతి, ఆగస్టు 6: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులకు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈరోజు(గురువారం) కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో లోకేశ్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ చేసిన విధ్వంసం, కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిన తీరును అందరికీ తెలియాలని చెప్పారు. ప్రతి ఇంటి వద్దా కనీసం 3 నిమిషాలైనా ఉండి వివరించాలంటూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.


అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై లోకేశ్ వద్ద మంత్రులు చర్చించారు. ఎల్‌నినో పరిస్థితులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా వివరిద్దామని మంత్రి తెలిపారు. జలాశయాల్లోకి వరద రావడం కాస్త ఊరటనిచ్చే అంశమని చెప్పుకొచ్చారు. తొలి ప్రాధాన్యం తాగునీరు, ద్వితీయ ప్రాధాన్యం పశుగ్రాసానికి ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారానికి అసెంబ్లీని వేదిక చేసుకుందామని మంత్రులకు లోకేశ్ వివరించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ కేబినెట్ ముందుకు 30కి పైగా అజెండా అంశాలు..

దేశంలోనే తొలిసారి.. ఏపీ హస్తకళలకు ‘క్యూఆర్ కోడ్’

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 01:01 PM