Share News

ఢిల్లీలో మంత్రి నాదెండ్ల బిజీబిజీ.. నిత్యావసర ధరలపై కీలక చర్చలు

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:10 PM

ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(NCCF) మేనేజింగ్ డైరెక్టర్(MD)ని మంత్రి కలిశారు.

ఢిల్లీలో మంత్రి నాదెండ్ల బిజీబిజీ.. నిత్యావసర ధరలపై కీలక చర్చలు
Nadendla Manohar

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(NCCF) మేనేజింగ్ డైరెక్టర్‌ని(MD) మంత్రి కలిశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరా తీరు, ధరల నియంత్రణ, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సరుకులు అందుబాటులో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలందరికీ నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. అనంతరం, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని నాదెండ్ల మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.


ఆపై ఢిల్లీ ఏపీ భవన్‌లో సివిల్ సప్లై శాఖ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన రైస్ స్టోర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో నాదెండ్ల మాట్లాడుతూ.. ఢిల్లీలో తెలుగువారి కోసం నాణ్యమైన రైస్ అందించేందుకు స్టోర్‌ను ప్రారంభించామని తెలిపారు. రేపు కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి పామ్ ఆయిల్, ఉల్లిపాయలు, పప్పు ధరలపై చర్చిస్తామని చెప్పారు. సివిల్ సప్లై శాఖలో అవినీతి జరగకుండా చర్యలు చేపట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సాత్విక్‌-చిరాగ్ జోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

యువత భవిష్యత్తుతో రాజకీయం తగదు.. వైసీపీకి మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 04:12 PM