Share News

ఎస్‌పీఐఈఎఫ్ నుంచి మంత్రి లోకేశ్‌కు ఆహ్వానం..

ABN , Publish Date - May 31 , 2026 | 01:27 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా రష్యా పర్యటనకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో మంత్రి లోకేశ్ పర్యటించనున్నారు.

ఎస్‌పీఐఈఎఫ్ నుంచి మంత్రి లోకేశ్‌కు ఆహ్వానం..
Minister Nara Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా రష్యా పర్యటనకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో మంత్రి లోకేశ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సదస్సు 'సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF'26)'లో ఆయన పాల్గొనున్నారు.


ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు హాజరు కావాల్సిందిగా ఎస్‌పీఐఈఎఫ్ నిర్వాహకులు మంత్రి లోకేశ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించే ఈ అంతర్జాతీయ ఆర్థిక వేదికలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారు. వారితో మంత్రి లోకేశ్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను మంత్రి వివరించనున్నారు.


ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థలతో మంత్రి లోకేశ్ చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సాంకేతిక భాగస్వామ్యాలు లభించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

సూపర్ స్టార్ కృష్ణ జయంతి.. సీఎం చంద్రబాబు ఘన నివాళి..

Updated Date - May 31 , 2026 | 01:30 PM