Share News

మంగళగిరిలో నకిలీ మద్యం అంటూ ప్రచారం.. ఎక్సైజ్ శాఖ క్లారిటీ

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:52 PM

మంగళగిరిలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఏపీ ఎక్సైజ్ శాఖ ఖండించింది. వైరల్ అవుతున్న వీడియోలో మద్యం బాటిల్‌ను తప్పుడు పద్ధతిలో స్కాన్ చేయడం వల్లే ఎర్రర్ వచ్చిందని వెల్లడించింది.

మంగళగిరిలో నకిలీ మద్యం అంటూ ప్రచారం.. ఎక్సైజ్ శాఖ క్లారిటీ
AP Excise

అమరావతి, సెప్టెంబర్ 25: మంగళగిరిలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఏపీ ఎక్సైజ్ శాఖ ఖండించింది. వైరల్ అవుతున్న వీడియోలో మద్యం బాటిల్‌ను తప్పుడు పద్ధతిలో స్కాన్ చేయడం వల్లే ఎర్రర్ వచ్చిందని వెల్లడించింది. యాప్ ఇన్‌స్టాల్ చేసుకునే QR కోడ్‌ను స్కాన్ చేసి, బాటిల్ నకిలీదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎక్సైజ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం బాటిల్ ప్రామాణికతను తెలుసుకోవాలంటే బాటిల్ క్యాప్‌పై ఉండే ‘వెరిఫికేషన్ QR కోడ్’ను మాత్రమే స్కాన్ చేయాలని సూచించారు.


ఇప్పటికే మొబైల్‌లో ఉన్న ‘AP Excise Suraksha’ యాప్ ద్వారా క్యాప్ లేబుల్‌ను స్కాన్ చేస్తేనే అసలు వివరాలు బయటకు వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టీకరించారు. సరైన ప్రక్రియ పాటించకుండా ‘QR Code Not Found’ అని రాగానే నకిలీ మద్యం అనడం నిరాధారమన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఇటువంటి వదంతులు నమ్మి ప్రజలు అపోహలకు గురికావద్దని ఎక్సైజ్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

శ్రీ సత్యసాయి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం: మంత్రి సవిత

విశాఖలో క్రైమ్ రికవరీ.. రూ.1.13 కోట్ల విలువైన ఆస్తులు బాధితులకు అప్పగింత

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 03:54 PM