కృష్ణా జిల్లాలో అర్బన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 28న పోలింగ్
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:22 PM
కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా చేపడతామని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ స్పష్టం చేశారు. గురువారం మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మచిలీపట్నం, అక్టోబర్ 15: కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా చేపడతామని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ స్పష్టం చేశారు. గురువారం మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు వివరించారు. మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు యుఎల్బిలలో మొదటి విడత అర్బన్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.
అర్బన్ ఎన్నికలకు అక్టోబర్ 16 నుంచి 18 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ప్రకటించారు. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన.. 21వ తేదీన ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబర్ 28వ తేదీన ఎన్నికల నిర్వహణ చేపడతామని తెలిపారు. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధులు నిర్వహించే అధికారుల వివరాలను ప్రెస్ నోట్ ద్వారా తెలియ పరుస్తామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్లు.. జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
ఎల్నినో కోవిడ్ లాంటి సంక్షోభం.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
Read Latest AP News And Telugu News