జోగి మేఘన కారు ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - Oct 23 , 2026 | 10:56 AM
వైసీపీ నేత జోగి రమేశ్ కోడలు జోగి మేఘన ప్రయాణించే కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేఘన ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొనడంపై అనుమానం వ్యక్తం చేస్తూ మేఘన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 23: వైసీపీ నేత జోగి రమేశ్ కోడలు జోగి మేఘన ప్రయాణించే కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేఘన ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొనడంపై అనుమానం వ్యక్తం చేస్తూ మేఘన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోగి మేఘన, ఆమె తండ్రి కృష్ణ ఈనెల 15న విజయవాడ నుంచి కోదాడకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది.
అయితే ఈ ఘటనలో మాజీ మంత్రి జోగి రమేశ్ హస్తం ఉండి ఉండొచ్చని అనుమానం చేస్తూ ఈనెల 16న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మేఘన తండ్రి కృష్ణ ఫిర్యాదు చేశారు. తమకు ప్రాణహాని ఉందని, ఈ ప్రమాదంపై విచారణ చేయాలని పోలీసులను మేఘన తండ్రి కోరారు. దీనిపై ఇబ్రహింపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా.. మూడు నెలల క్రితం జోగి రమేశ్ కుటుంబ వ్యవహారంపై తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. 2025లో జోగి రమేశ్ పెద్ద కుమారుడితో మేఘన వివాహం జరిగింది. అయితే పెళ్లైన నెల నుంచే వేధింపులు మొదలయ్యాయని, చిత్రహింసలకు గురిచేయడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ మేఘన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అదనపు కట్నం డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో కారు ప్రమాదం వెనుక జోగి రమేశ్ హస్తం ఉందంటూ మేఘన తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి..
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు..
ఎన్నికల్లో మారణాయుధాలను చూపి బెదిరించడం దుర్మార్గం: ఆనం
Read Latest AP News And Telugu News