Share News

చంద్రగ్రహణం.. గిరి ప్రదక్షిణ రద్దు..

ABN , Publish Date - Mar 02 , 2026 | 06:18 PM

పాల్గుణ పౌర్ణమి రోజు కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

చంద్రగ్రహణం.. గిరి ప్రదక్షిణ రద్దు..
indrakeeladri

విజయవాడ, మార్చి 02: పాల్గుణ పౌర్ణమి రోజు కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 10.00 గంటలకు దుర్గమ్మ ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాల కవాట బంధనం చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే చంద్రగ్రహణం కారణంగా.. పౌర్ణమి వేళ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా శాంతి కళ్యాణం, చండీ హోమం, సాయంత్రం పంచ హారతులతోపాటు పల్లకీ సేవ సహా ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వివరించారు.


మార్చి 4వ తేదీ అంటే.. బుధవారం తెల్లవారుజామున 3:00 గంటలకు కవాట ఉద్ఘాటన చేస్తామని వివరించారు. అనంతరం సుప్రభాతం, స్నపనాభిషేకం ఆ తర్వాత అర్చన, మహానివేదన, హారతి నిర్వహణ ఉంటుందని చెప్పారు. ఆ రోజు ఉదయం 8.00 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు. ఇక సుప్రభాతం, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు.


బుధవారం ఉదయం 7:30 గంటలకు జరిగే ఆర్జిత సేవలు.. గంట తర్వాత అంటే.. ఉదయం 8:30 గంటల నుంచి ప్రారంభమవుతాయని వివరించారు. చంద్రగ్రహణం సందర్భంగా చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లకు సహకరించాలని భక్తులకు దేవస్థానం ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.


అలాగే గ్రహణానికి సంబంధించిన సమయాన్ని ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు వివరించారు.

  • గ్రహణ స్పర్శ కాలం: మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభం

  • గ్రహణ మోక్ష కాలం: సాయంత్రం 6:48 గంటలకు అవుతుంది.

  • గ్రహణ కాలం మొత్తం: 3 గంటల 28 నిమిషాలు


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రగ్రహణం.. హోలీ పండగ ఎప్పుడు..?

గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి

For More AP News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 06:41 PM