Share News

గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:38 PM

గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో కీలక సమావేశం నిర్వహించారు.

గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
CM Chandrababu Naidu

అమరావతి, జూన్ 2: గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు(మంగళవారం) సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో కీలక సమావేశం నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి. పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై చర్చలు జరిపారు. భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యంపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. పుష్కరాల కోసం మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. నీటి వనరులు, రోడ్లు, ఆరోగ్య శాఖల సమన్వయంపై సమావేశంలో చర్చించారు. పుష్కర ఘాట్ల అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. పుష్కరాల నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


ఈ సమావేశానికి ఎండోమెంట్స్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరవగా.. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వర్చువల్‌గా హాజరయ్యారు. అలాగే సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, గోదావరి పుష్కరాల నోడల్ అధికారి వీరపాండియన్ సమీక్షకు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

పనిచేయకపోతే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా.. ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 04:46 PM