Share News

మహిళతో మాటలు కలిపి.. అకస్మాత్తుగా చెయిన్ లాక్కెళ్లిన దుండగుడు

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:00 PM

హైదరాబాద్‌లో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. కూరగాయాల కోసం బయటకు వెళ్లిన మహిళతో ఓ వ్యక్తి మాటలు కలిపి అకస్మాత్తుగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు.

మహిళతో మాటలు కలిపి.. అకస్మాత్తుగా చెయిన్ లాక్కెళ్లిన దుండగుడు
Hyderabad Chain Snatching

హైదరాబాద్, జూన్ 2: నగరంలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. కూరగాయాల కోసం బయటకు వెళ్లిన మహిళతో ఓ వ్యక్తి మాటలు కలిపి అకస్మాత్తుగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగి ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రత్నమాల అనే మహిళ కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్తోంది. దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలోని వేదశ్రీ అపార్ట్‌మెంట్‌లో తన నివాసంలోకి అడుగు పెట్టగానే ఓ గుర్తు తెలియని వ్యక్తి కాలినడకన ఆమె వద్దకు వచ్చాడు.


మహిళతో కాసేపు మాట్లాడిన నిందితుడు.. ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడి చర్యతో మహిళ షాక్‌కు గురైంది. దొంగలించిన గొలుసు సుమారు రెండున్నర తులాలు ఉంటుందని అంచనా. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు హెల్మెట్ ధరించి ఉన్నట్లు తెలుస్తోంది. దుండగుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

2028 డిసెంబర్‌లో మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం: కేటీఆర్

99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై సీఎస్ రామకృష్ణారావు సమీక్ష

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 04:06 PM