అర్హులైన మత్స్యకార కుటుంబాలకు సాయం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Sep 26 , 2026 | 04:44 PM
తుఫాను ప్రభావిత ప్రాంతాల మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండ ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం అందజేస్తామన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 26: తుఫాను ప్రభావిత ప్రాంతాల మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండ ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం అందజేస్తామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వేట నిలిచిపోవడంతో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు. మత్స్యకారుల కుటుంబాలకు బియ్యాన్ని పంపిణీ చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత అర్హులైన అన్ని మత్స్యకార కుటుంబాలకు సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
ఆపద సమయంలో సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. వాతావరణం అనుకూలించే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు. అధికారుల హెచ్చరికలను పాటించి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మత్స్యకారుల ప్రాణ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కాకినాడ మత్స్యకారుల పడవ ఒడిశాలోని పారాదీప్‌కు సురక్షితంగా చేరిందని... పడవలోని 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
స్థానిక ఎన్నికలపై కూటమి భేటీ.. సమన్వయంతో పనిచేయాలని మంత్రుల పిలుపు
దశాబ్దాల కల నెరవేర్చనున్న సీఎం.. 30న క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ
Read Latest AP News And Telugu News