Share News

కాకినాడ బాణసంచా పేలుడు.. సహాయక చర్యలపై సీఎం ఆరా

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:51 PM

కాకినాడ బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. ఘటనాస్థలిలో అందుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు.

కాకినాడ బాణసంచా పేలుడు.. సహాయక చర్యలపై సీఎం ఆరా
CM Chandrababu Naidu

అమరావతి, ఫిబ్రవరి 28: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదంలో అధికారులతో సీఎం మాట్లాడారు. విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రమాద ఘటన గురించి అధికారులు తెలియజేశారు. దీంతో విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు... ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన సూర్య ఫైర్ వర్క్స్‌లో 20 మంది వరకు పని చేస్తున్నారని అధికారులు తెలియజేశారు. బాణసంచా తయారీదారులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

ఈ ప్రమాదంపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లోనూ స్పందించారు సీఎం. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించామని చెప్పారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

‘బ్లూ జెట్‌ హెల్త్ కేర్’ ఔషధ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 28 , 2026 | 04:06 PM