Share News

వేట్లపాలెంలో భారీ పేలుడు.. 18 మంది మృతి

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:16 PM

కాకినాడలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందారు.

వేట్లపాలెంలో భారీ పేలుడు.. 18 మంది మృతి
Massive Blast

కాకినాడ, ఫిబ్రవరి 28: సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అలాగే ఈ ప్రమాదంలో అనేమంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు సమయంలో మొత్తం 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పేలుడుతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది.


సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. పేలుడు శబ్ధం విని స్థానికులు భారీగా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.


ఇవి కూడా చదవండి...

ఏపీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

‘బ్లూ జెట్‌ హెల్త్ కేర్’ ఔషధ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 28 , 2026 | 04:35 PM