రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
ABN , Publish Date - Apr 13 , 2026 | 08:37 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో RTG సమావేశం జరిగింది. పాలనలో డేటా వినియోగంపై దృష్టి సారించిన సీఎం, టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలోని RTGS కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో డేటా డ్రివెన్ డిసిషన్ మేకింగ్‌పై ఉన్నతస్థాయి చర్చ జరిగింది. పాలనలో డేటా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం, రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ పనితీరును సమీక్షించారు. ముఖ్య శాఖల కార్యదర్శులతో పాటు ఫైనాన్స్, ప్లానింగ్, వెల్ఫేర్ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డేటా లేక్ నిర్మాణం, టెక్నాలజీ వినియోగం, డేటా అనలిటిక్స్ ద్వారా నిర్ణయాలు తీసుకునే విధానాలపై చర్చించారు. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. RTGS, APSDMA, APSFL సంస్థల ప్రతినిధులతో పాటు డిజిటల్ కార్పొరేషన్, ట్రికోర్, వాసర్ ల్యాబ్స్ ప్రతినిధులు కూడా సమావేశంలో హాజరయ్యారు. అన్న క్యాంటీన్ ట్రస్ట్, గ్రామ-వార్డు సచివాలయాల (GSWS) అధికారులు కూడా పాల్గొన్నారు. డేటా అనలిటిక్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకునే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. అలాగే సంబంధిత అన్ని శాఖలు పరస్పరం సమన్వయంతో పని చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి
క్రూడాయిల్ పైకి.. స్టాక్ మార్కెట్లు కిందకి..
జీవితం నాశనం చేసే అలవాట్లు ఇవే.. ప్రతి పురుషుడు తప్పక తెలుసుకోవాల్సినవి