Share News

టీడీపీ కార్యకర్తల ఆర్థిక బలోపేతం కోసం సీఎం చంద్రబాబు కొత్త ప్లాన్

ABN , Publish Date - Apr 11 , 2026 | 02:55 PM

పార్టీ సీనియర్ నేతలతో నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినాయకత్వం శిక్షణ ఇప్పిస్తోంది. శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో కాఫీ తాగుతూ తన అభిప్రాయాలను పంచుకున్నారు సీఎం చంద్రబాబు.

టీడీపీ కార్యకర్తల ఆర్థిక బలోపేతం కోసం సీఎం చంద్రబాబు కొత్త ప్లాన్
CM Chandrababu Naidu

అమరావతి, ఏప్రిల్ 11: టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. పార్టీ సీనియర్ నేతలతో నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినాయకత్వం శిక్షణ ఇప్పిస్తోంది. శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో కాఫీ తాగుతూ తన అభిప్రాయాలను సీఎం పంచుకున్నారు. రాజకీయాల్లో, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలను కార్యకర్తలకు వివరించారు.


క్షేత్రస్థాయిలో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుపైనా నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను... ప్రత్యర్ధి పార్టీ దుర్మార్గాలను సామాన్య కార్యకర్తలైనా మెరుగ్గా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం అమలు చేస్తామని ప్రకటించారు.


టీడీపీ ఓటు బ్యాంక్ పెరగాలి: సీఎం

‘క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టాం... క్లీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాం... క్లీన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నాం. క్లీన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీని నిలిపేలా కార్యకర్తలు పని చేయాలి. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలని... పాజిటివ్ ఓట్లు పెంచుకోవాలి... గతానికంటే టీడీపీ ఓట్ బ్యాంక్ పెరగాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు తెలియజేశారు. పార్టీ నేతలు, కార్యకర్తల కోసం E3 ప్రొగ్రాం తీసుకొస్తామని చెప్పారు. నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్’ కార్యక్రమం చేపడతామన్నారు. ‘నా కుటుంబం కోసం ఏ విధంగా ఆలోచన చేశానో... టీడీపీ కుటుంబం కోసం అదే విధంగా ఆలోచన చేస్తున్నా’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏబీఎన్‌పై దాడికి యత్నం.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

వీడియోలతో ఏఎస్‌ఐ బ్లాక్‌మెయిల్.. మహిళా కమిషన్ సీరియస్..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 03:44 PM