Share News

వీడియోలతో ఏఎస్‌ఐ బ్లాక్‌మెయిల్.. మహిళా కమిషన్ సీరియస్..

ABN , Publish Date - Apr 11 , 2026 | 01:45 PM

ప్రేమజంటలను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న మాచర్ల ఏఎస్‌ఐ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఏఎస్‌ఐ తీరుపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.

వీడియోలతో ఏఎస్‌ఐ బ్లాక్‌మెయిల్.. మహిళా కమిషన్ సీరియస్..
Macharla ASI Controversy

పల్నాడు జిల్లా, ఏప్రిల్ 11: మాచర్ల నియోజకవర్గంలో ప్రేమజంటల పట్ల ఓ పోలీసు అధికారి వ్యవహరిస్తున్న తీరు సంచలనం సృష్టించింది. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు రహస్యంగా తీసి, బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని ఏఎస్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోలను చూపించి మహిళలను లైంగికంగా వేధించి, తన కోరికలు తీర్చాలంటూ బలవంతం చేస్తున్న పోలీసు అధికారి తీరు స్థానికులను షాక్‌కు గురయ్యేలా చేసింది. జమ్మలమడుగుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ సహాయంతో ఏఎస్‌ఐ రహస్య వీడియోలు తీయిస్తున్నట్లు సమాచారం. మాచర్లలో ఏఎస్‌ఐ బెదిరింపు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మాచర్లలోని స్థానిక ఎస్‌ఐ, కానిస్టేబుల్ కూడా ఇదే తరహాలో మహిళలను వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.


ఈ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

ఈ సంఘటనపై ఏపీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. మహిళల భద్రతకు ముప్పుగా మారిన ఈ చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. మహిళలపై జరుగుతున్న ఈ వేధింపులు సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

ఏబీఎన్‌పై దాడికి యత్నం.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 02:03 PM