ఈక్విటీ, నేచర్, ఆపర్చునిటీ, లివబుల్ సిటీగా అమరావతి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 16 , 2026 | 03:04 PM
సింగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో పాల్గొన్న సీఎం.. లీడర్షిప్ ప్లీనరీ-2లో ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’ అనే అంశంపై ప్రసంగించారు.
అమరావతి, జూన్ 16: సింగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో పాల్గొన్న సీఎం.. లీడర్షిప్ ప్లీనరీ-2లో ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’ అనే అంశంపై ప్రసంగించారు. 25 ఏళ్ల క్రితం ఐటీ గురించి మాట్లాడానని... ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్‌తో ఈరోజు తెలుగువాళ్లు తలసరి ఆదాయంలో ముందున్నారని తెలిపారు. ఇప్పుడు ఏఐ వచ్చిందన్నారు. నాడు సైబరాబాద్‌ను అభివృద్ధి చేశామని... నేడు తెలంగాణకు ప్రధాన ఆదాయవనరుగా మారిందని చెప్పారు. రాష్ట్ర విభజనతో మరో నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చిందని... అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని వెల్లడించారు.
పీపుల్ ఫస్ట్ మా విధానమని... ఈక్విటీ, నేచర్, ఆపర్చునిటీ, లివబుల్ సిటీగా అమరావతి ఉంటుందని సీఎం తెలిపారు. అంతర్జాతీయ మౌలిక వసతులతో, అవకాశాల వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామన్నారు. కృష్ణానది, ఇన్నర్ - ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జిలతో అద్భుతంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని వివరించారు. స్పోర్ట్స్, ఫైనాన్సియల్, నాలెడ్జ్, జస్టిస్, టూరిజం, హెల్త్, మీడియా వంటి కాన్సెప్ట్స్ తీసుకున్నామన్నారు. ఒకే ఒక్క పిలుపుతో రాజధాని కోసం రైతులు 35 వేల ఎకరాలను అప్పగించారని... వాటిలో కొంత భాగాన్ని అభివృద్ధి చేసి రైతులకు తిరిగి ప్లాట్లు ఇస్తున్నామన్నారు. 21 కి.మీ పొడవునా వాటర్ ఫ్రంట్ నగరంగా అమరావతి ఉంటుందని తెలిపారు.
సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, అండర్ గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్ జీరో లక్ష్యంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. సైబరాబాద్‌లో నాడు ఎకరం రూ.2 లక్షలు ఉంటే... నేడు రూ.200 కోట్లకు పెరిగిందన్నారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి సాధ్యమవుతుందనేందుకు సైబరాబాద్ నిదర్శనమని తెలిపారు. అమరావతిని నాలెడ్జ్ సిటీగా చేస్తున్నామని.. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలను తీసుకువస్తున్నామని అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ హబ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ఆకర్షణలన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి నిర్మాణం అవుతోందన్నారు. అమరావతిని సందర్శించి.. సరికొత్త ఆలోచనలతో అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి బండి సంజయ్
టీజీ బిల్డర్స్ అసోసియేషన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ
Read Latest Telangana News And Telugu News