ఉబర్ సీఈఓతో సమావేశం.. ఎక్స్‌లో వివరాలు తెలియజేసిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - May 14 , 2026 | 01:49 PM
ఉబర్ గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్‌తో సీఎం చంద్రబాబు సమావేశం, చర్చించిన అంశాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఉబర్ సీఈవో దారా ఖోస్రోషాహి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగిందన్నారు.
అమరావతి, మే 14: ఏపీలో ప్రముఖ సంస్థల పెట్టుబడులు, ఆయా సంస్థల ప్రతినిధులతో కీలక సమావేశాలకు సంబంధించిన వివరాలను మంత్రి నారా లోకేశ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఉబర్ గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్‌తో సీఎం చంద్రబాబు సమావేశం, చర్చించిన అంశాలను ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఉబర్ సీఈవో దారా ఖోస్రోషాహి(Dara Khosrowshahi) నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగిందన్నారు. టెక్నాలజీ, మొబిలిటీ, ఇన్నోవేషన్‌పై విస్తృతంగా చర్చలు జరిపినట్లు చెప్పారు. స్కిల్లింగ్, అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ భవిష్యత్తుపైనా చర్చించామన్నారు.

భవిష్యత్తు నగర రవాణా విధానాలు, గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యాల బలోపేతంపై, ఆధునిక మొబిలిటీ సొల్యూషన్స్‌పై ఉబర్ టీమ్‌తో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలపై చర్చలు జరిగాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. గ్లోబల్ లీడర్లతో చర్చలు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ అవకాశాలపై దృష్టి సారించాలంటూ లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి...
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి సర్కార్ కృషి: ఎంపీ కేశినేని శివనాథ్
వైన్ షాపు వద్ద దారుణం.. వంద రూపాయల కోసం..
Read Latest AP News And Telugu News