Share News

ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ పదవీకాలం పొడిగింపు

ABN , Publish Date - May 15 , 2026 | 02:55 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఆయన సీఎస్‌గా కొనసాగనున్నారు.

 ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ పదవీకాలం పొడిగింపు
AP Chief Secretary

అమరావతి, మే 15: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఆయన సీఎస్‌గా కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సాధారణ పరిపాలన శాఖ(డీఓపీటీ) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. AIS(ఆల్ ఇండియా సర్వీసెస్) రూల్ 16(1)(DCRB) 1958 ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఓపీటీ అండర్ సెక్రటరీ రాజేశ్ కుమార్ యాదవ్ లేఖలో స్పష్టం చేశారు.


ఈ నెలాఖరులోనే(మే నెల) సాయి ప్రసాద్‌ పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఆయన పదవీకాలం పొడిగింపునకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో నవంబర్ 30, 2026 వరకు సాయి ప్రసాద్.. ఏపీ సీఎస్‌గా కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు కేంద్రం ఈ అధికారిక సమాచారాన్ని అందించింది.


ఇవి కూడా చదవండి...

నా దేశం.. నా బాధ్యత నినాదంతో ముందుకు సాగాలి: మంత్రి కొల్లు రవీంద్ర

బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2026 | 03:18 PM