Share News

రైతులను ముంచే స్టేట్‌మెంట్లు మానుకో.. జగన్‌కు అచ్చెన్నాయుడు హితవు

ABN , Publish Date - Jul 29 , 2026 | 03:45 PM

రైతుల శ్రేయస్సు కోరుకోవడమే రాజకీయ నాయకుడి లక్షణమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సలహాలు ఇస్తే ఆహ్వానిస్తామని.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటున్న సమయంలో నెగిటివ్ స్టేట్‌మెంట్లతో మరింత నష్టం చేయొద్దని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

రైతులను ముంచే స్టేట్‌మెంట్లు మానుకో.. జగన్‌కు అచ్చెన్నాయుడు హితవు
Minister Athchennaidu

అమరావతి, జులై 29: రైతుల శ్రేయస్సు కోరుకోవడమే రాజకీయ నాయకుడి లక్షణమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సలహాలు ఇస్తే ఆహ్వానిస్తామని.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటున్న సమయంలో నెగిటివ్ స్టేట్‌మెంట్లతో మరింత నష్టం చేయొద్దని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘నీ స్టేట్‌మెంట్ల వల్ల రైతులు మరింత ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉంది.. కనీసం అదైనా ఆలోచించు జగన్‌మోహన్ రెడ్డి’ అంటూ హితవుపలికారు. పొగాకు రైతులను గతంలోనూ.. ఇప్పుడూ.. సక్రమంగా ఆదుకుంటున్న ప్రభుత్వం తమదే అని స్పష్టం చేశారు.


2014-15లో ఎఫ్‌సీవీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు కేజీకి రూ.20 ఇచ్చి రైతులను ఆదుకున్నామని మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో 11 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. గత ఏడాది 25 మిలియన్ కేజీల హెచ్‌డీ బర్లీ పొగాకును రూ.270 కోట్లతో కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని తెలిపారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి, పొగాకు కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతుల నుంచి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రైతులకు కేజీకి రూ.20 సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.


కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టామని అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు రూ.188 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజూ పొగాకు రైతుల సమస్యలపై సమీక్షిస్తూ తగిన ఆదేశాలు ఇస్తున్నారని వెల్లడించారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలు జగన్‌మోహన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘జగన్‌మోహన్ రెడ్డి.. రైతులకు మంచి చేసే పని చేయి.. రైతులను మరింత ముంచేలా చేసే నీ స్టేట్‌మెంట్లు మానుకోవాలి’ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు హితవుపలికారు.


ఇవి కూడా చదవండి...

మెగా డీఎస్సీపై వైసీపీవి నిరాధార ఆరోపణలు: సానా సతీష్ బాబు

జగన్ క్రెడిట్‌ చోరీ చేస్తే జైలుకే.. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సెటైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 05:23 PM