Share News

వయస్సు రీత్యా నెక్ట్స్ పోటీలో ఉండేదెవరో.. మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ..

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:16 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శాసనమండలి విరామ సమయంలో నేతల మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. వయస్సు రీత్యా తదుపరి ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు.. ఎవరు వెనక్కి తగ్గుతారోనంటూ మంత్రులు, ఎమ్మెల్సీలు ముచ్చటించారు.

వయస్సు రీత్యా నెక్ట్స్ పోటీలో ఉండేదెవరో.. మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ..
AP ministers discussion

అమరావతి, ఆగస్టు 18: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శాసనమండలి విరామ సమయంలో నేతల మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అనిత, సవిత, ఫరూక్, సంధ్యారాణి.. ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాంగోపాల్ రెడ్డి, శ్రీకాంత్, అనురాధ, గ్రీష్మ తదితరుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వయస్సు రీత్యా తదుపరి ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు.. ఎవరు వెనక్కి తగ్గుతారోనంటూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి మంత్రి లోకేశ్ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘బుచ్చయ్య తాత ఇప్పటికీ రంగు రంగుల షర్ట్‌లతో కలర్ ఫుల్‌గా వస్తున్నారు.. నేనే యూత్, మళ్లీ నేనే పోటీ అన్నట్లుగా బుచ్చయ్య చౌదరి ఉన్నారని’ చమత్కరించారు.


వయసు రీత్యా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అందరికంటే పెద్ద వారైనా పూర్తి ఫిట్‌గా ఉన్నారని నేతలు అభిప్రాయపడ్డారు. 85ఏళ్లు పైబడి ఉన్నా రోజూ స్విమ్మింగ్, వ్యాయామంతో ఫిట్‌నెస్‌ కాపాడుకుంటున్నారని చెప్పగా.. వీరి సంభాషణలో మధ్యలో కల్పించుకున్న మంత్రి ఫరూక్.. ‘నేను బుచ్చయ్య చౌదరి, వరదరాజులరెడ్డి కంటే చిన్నవాడిని.. చంద్రబాబు కంటే నా వయసు 20 రోజులు తక్కువ ఉంది’ అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. ఫరూక్ మాటలతో మిగిలిన మంత్రులంతా నవ్వులు చిందించారు


ఇవి కూడా చదవండి...

స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

చెడిపోయిన ప్రతి మొక్కకు వెయ్యి సాయం.. కొత్త మొక్కలు పెట్టిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 01:35 PM