Share News

ఏపీ లిక్కర్ స్కాంలో కొత్త ట్విస్ట్.. వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

ABN , Publish Date - Jul 20 , 2026 | 08:53 PM

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సిట్ సమర్పించిన రిమాండ్ రిపార్టులో కీలక అంశాలను ప్రస్తావించింది.

ఏపీ లిక్కర్ స్కాంలో కొత్త ట్విస్ట్.. వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

విజయవాడ, జులై 20: వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సిట్ సమర్పించిన రిమాండ్ రిపార్టులో కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ స్కాంలో వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డితోపాటు కారుమూరి సునీల్ సహా మరికొంత మంది కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని స్పష్టం చేసింది. జిల్లా స్థాయిలో వికేంద్రీకృత విధానాన్ని రద్దు చేసి.. ఆ స్థానంలో రాష్ట్రస్థాయి విధానాన్ని తీసుకొచ్చారని పేర్కొంది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ రిపోర్టులో వివరించింది. ప్రభుత్వ అనుమతులు రాకుండానే టెండర్ పత్రాలు సిద్ధం చేశారని తెలిపింది.


కార్టన్ రవాణా ఖర్చు రూ.19.68కి బదులు రూ.32.53కి పెంచారని చెప్పింది. సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలకు లబ్ధి కలిగేలా.. టెండర్ నిబంధనలు రూపొందించారని స్పష్టం చేసింది. షెల్ కంపెనీలు, పెట్రోల్ బంకులు, బినామీల ద్వారా నగదు మళ్లించారని పేర్కొంది. వాసుదేవరెడ్డి బంధువు విజయ నరసింహారెడ్డి(A2) పేరుతో ఉన్న.. కంపెనీలకు నిధులు బదిలీ అయ్యాయని తెలిపింది. నిందితుల నుంచి హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. ఇందులో కారుమూరి సునీల్, రాజ్‌ కసిరెడ్డి పాత్ర కీలకమని రిమాండ్‌ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వచ్చాంధ్ర కోసం వాణిజ్య, స్వచ్ఛంధ సంస్థలను భాగస్వామ్యం చేయాలి: పట్టాభిరామ్

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2026 | 09:10 PM