Share News

లక్ష సీసీటీవీ కెమెరాల టార్గెట్.. 70 శాతం సక్సెస్: హోం మంత్రి అనిత

ABN , Publish Date - May 11 , 2026 | 04:26 PM

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, పోలీస్‌ స్టేషన్‌ను మంత్రులు ప్రారంభించారు.

లక్ష సీసీటీవీ కెమెరాల టార్గెట్.. 70 శాతం సక్సెస్: హోం మంత్రి అనిత
Home Minister Anitha

కృష్ణా, మే 11: ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ... ఏపీలో గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. కోటి నలభై లక్షల రూపాయలతో ఆత్కూర్ పోలీస్ స్టేషన్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే పెచ్చులు ఊడి మీద పడే పరిస్థితి ఉండేదన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళుతున్నారని చెప్పారు. లక్ష సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ టార్గెట్ పెట్టుకొని 70 శాతం సక్సెస్ అయ్యామన్నారు. ఏదైనా నేరం జరిగిందంటే 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదిస్తున్నారని హోం మంత్రి అనిత తెలిపారు.


ఆత్కూరు గ్రామంలో సీసీ రోడ్లను మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు పాల్గొన్నారు. అలాగే ఆత్కూర్ పోలీస్ స్టేషన్‌ను మంత్రులు, ఎమ్మెల్యే వెంకట్రావు ప్రారంభించారు. స్టేషన్‌లో హోంమంత్రి జ్యోతి ప్రజ్వలన చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

ప్రభుత్వ సచివాలయాల్లో చోరీ.. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్

ఏపీని కరవు రహితంగా మార్చడంలో పోలవరం కీలకం: మంత్రి నిమ్మల రామానాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2026 | 04:54 PM