Share News

ప్రభుత్వ సచివాలయాల్లో చోరీ.. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్

ABN , Publish Date - May 11 , 2026 | 03:12 PM

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై చోరీలకు పాల్పడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలు చేసిన మహేశ్ నుంచి 30 ప్రింటర్లు, 3 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ సచివాలయాల్లో చోరీ.. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్
Chittoor News

చిత్తూరు, మే 11: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై చోరీలకు పాల్పడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి మహేశ్‌ బాబును చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ సచివాలయాల్లో చోరీలు చేసిన మహేశ్ నుంచి 30 ప్రింటర్లు, 3 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.8,10,400 లక్షలుగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మహేశ్‌పై చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో 18 కేసులు నమోదు అయ్యాయి. ఎస్‌.ఆర్ పురం మండలం కన్యాకాపురం గ్రామానికి చెందిన మహేశ్.. ఆన్‌లైన్ బెట్టింగ్, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడినట్లు పోలీసులు తెలిపారు. ఈజీగా డబ్బును సంపాదించడం కోసం దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నట్లు చెప్పారు.


నిందితుడు ఇంజినీరింగ్ విద్యార్థి అయినప్పటికీ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైనట్లు పోలీసులు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలిస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్: లోకేశ్

శాంతిభద్రతలపైనే సీఎం చంద్రబాబు దృష్టి: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2026 | 03:31 PM