Share News

శాంతిభద్రతలపైనే సీఎం చంద్రబాబు దృష్టి: హోం మంత్రి అనిత

ABN , Publish Date - May 11 , 2026 | 02:48 PM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతలపై దృష్టి సారించారని హోం మంత్రి అనిత తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6000 మంది పోలీసులను భర్తీ చేశారన్నారు.

శాంతిభద్రతలపైనే సీఎం చంద్రబాబు దృష్టి: హోం మంత్రి అనిత
Home Minister Anitha

కృష్ణా జిల్లా, మే 11: గత ఐదేళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడిరోడ్డుపై నిలబెట్టారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతలపై దృష్టి సారించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6000 మంది పోలీసులను భర్తీ చేశారన్నారు.


రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెబుతూ.. ఎస్పీ, ఐజీని హోం మంత్రి అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందిని అనిత అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక శాసనసభ్యులు బోడె ప్రసాద్ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిత్యానంద రెడ్డి

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్: లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2026 | 02:55 PM