Share News

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్: లోకేశ్

ABN , Publish Date - May 11 , 2026 | 01:05 PM

సింగపూర్‌లో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. అమరావతిలో పుంగోల్ తరహాలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్: లోకేశ్
Minister Nara lokesh

సింగపూర్/అమరావతి, మే 11: సింగపూర్‌లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్‌లో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. భారతదేశంలోనే మోడల్ టౌన్‌షిప్‌గా నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సింగపూర్ తరహా గ్లోబల్ మైస్(మీటింగ్స్, ఇన్సెన్టీవ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో సులభతర వాణిజ్యం కోసం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఆర్టీజీఎస్‌లో సింగపూర్ అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకోనున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


సింగపూర్‌లో ఘన స్వాగతం..

సింగపూర్ చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీని రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రికి ప్రవాసాంధ్రులు ధన్యవాదాలు తెలిపారు. ప్రవాసాంధ్రులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ.. ‘మీరంతా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. మీరు పనిచేస్తున్న కంపెనీల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న పెట్టుబడుల కోసం మాట్లాడాలి’ అని లోకేశ్ తెలిపారు.


ఇవి కూడా చదవండి...

పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సత్కారం

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిత్యానంద రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2026 | 02:01 PM