ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. అమిత్ షాతో భేటీ
ABN , Publish Date - May 11 , 2026 | 12:11 PM
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. సోమవారం ఉదయం హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ, మే 11: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. సోమవారం ఉదయం హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు.. విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్ట్‌లతోపాటు నిధుల కేటాయింపులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు పలు అంశాలపై వారు చర్చిస్తారని సమాచారం.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్‌తో సహా నీతిఆయోగ్ సభ్యులతో సీఎం సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటన కోసం సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి సీఎం చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో కేంద్ర మంత్రులతోపాటు పలువురు ఎంపీలు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కడప అల్మాస్‌పేట సర్కిల్ ఘటనపై అధికారులు సీరియస్..
మోదీ రాక.. మరిచిపోలేని జ్ఞాపకం: నారా భువనేశ్వరి
For More AP News And Telugu News