పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించిన పవన్.. ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం..
ABN , Publish Date - May 11 , 2026 | 12:09 PM
చాలా రోజుల తర్వాత పవన్ మళ్లీ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం.
అమరావతి, మే 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. చాలా రోజుల తర్వాత పవన్ మళ్లీ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. సమయాన్ని బట్టి జనసేన ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
రేపు(మంగళవారం) మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో నూతనంగా ఎంపిక చేసిన జనసేన పార్టీ వివిధ కమిటీ సభ్యుల సమావేశం జరగనుంది. ఈ రోజు భేటీలో ఆ సమావేశానికి సంబంధించిన అంశాలపై పవన్ చర్చించే అవకాశ ఉంది. మంగళవారం జరగనున్న సమావేశంలో పాల్గొని.. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతంపై పవన్, నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు రాత్రి లోపు జనసేన రాష్ట్ర కమిటీలు, అనుబంధ విభాగాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
పవన్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ..
ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ ఇంటికి వెళ్లారు. పవన్‌ను పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. ‘ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది’ అని పవన్ కల్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి
తమిళనాడు సీఎం విజయ్‌పై మాజీ సీఎం స్టాలిన్ ఆగ్రహం
టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు పూర్తి మద్దతు: సీఎం రేవంత్