పోలీసుల ఎదుట లొంగిపోయిన నిత్యానంద రెడ్డి
ABN , Publish Date - May 11 , 2026 | 12:32 PM
వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానంద రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
కడప, మే 11: వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి లొంగిపోయారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానంద రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గత 20 రోజులుగా వైసీపీ నేత కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు(సోమవారం) ఉదయం ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ఎదుట నిత్యానంద రెడ్డి లొంగిపోయారు.
కొద్దిరోజుల క్రితం కడపలో వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి దారుణ హత్యకు గురయ్యారు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దాదాపు 11 మందిని అరెస్ట్ చేశారు. నిత్యానంద రెడ్డి చెప్పడం వల్లే దస్తగిరిని చంపినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసులో నిత్యానంద రెడ్డిని ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిత్యానంద రెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిత్యానందరెడ్డి నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు.. విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన స్నేహితులు.. ఏం జరిగిందంటే
పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సత్కారం
Read Latest AP News And Telugu News