Share News

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ABN , Publish Date - May 09 , 2026 | 03:54 PM

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశి భూషణ్ కుమార్‌కు జలవనరుల శాఖ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
AP IAS Transfers

అమరావతి, మే 9: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐఏఎస్ అధికారుల బదిలీలు, అదనపు బాధ్యతలపై శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశి భూషణ్ కుమార్‌కు జలవనరుల శాఖ బాధ్యతలు అప్పగించింది. జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్‌, ఫుల్ అడిషనల్ ఛార్జ్ బాధ్యతల నుంచి సీఎస్‌ సాయి ప్రసాద్‌కు ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చింది.


పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జీఓ ఆర్టీ నెంబర్ 918ను సీఎస్ జి.సాయి ప్రసాద్ జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

మద్యం మత్తులో కొడుకును హత్య చేసిన తండ్రి

సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు.. కడపలో ఉద్రిక్తం

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2026 | 04:48 PM