Share News

సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు.. కడపలో ఉద్రిక్తం

ABN , Publish Date - May 09 , 2026 | 01:48 PM

కడప జిల్లాలోని ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్కిల్‌ను టిప్పు సుల్తాన్ సర్కి‌ల్‌గా మార్చడంపై వివాదం చెలరేగింది.

సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు.. కడపలో ఉద్రిక్తం
Kadapa News

కడప, మే 9: నగరంలోని ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్కిల్‌ను టిప్పు సుల్తాన్ సర్కి‌ల్‌గా మార్చడంపై వివాదం చెలరేగింది. ఆల్మాస్‌ పేట సర్కిల్‌‌కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హనుమాన్ సర్కిల్‌గా మార్చాలని పట్టుబడుతోంది. టిప్పు సుల్తాన్ పేరును కొనసాగించాలని మరో వర్గం ఆందోళనకు దిగింది. దీంతో సర్కిల్ వద్ద ఇరువర్గాలు ఆందోళనకు దిగాయి.


ఇరువర్గాలకు చెందిన మద్దతుదారులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. రెచ్చిపోయిన ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడులకు దిగాయి. ఈ దాడుల్లో తాలూకా సీఐ నరసింహారావు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.


ఇవి కూడా చదవండి...

డిప్యూటీ సీఎం చొరవతో మస్కట్ నుంచి స్వగ్రామానికి షెహనాజ్

మద్యం మత్తులో కొడుకును హత్య చేసిన తండ్రి

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2026 | 02:09 PM