Share News

CURE, PURE, RARE మోడల్‌తో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్

ABN , Publish Date - May 09 , 2026 | 02:39 PM

హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు.

CURE, PURE, RARE మోడల్‌తో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్, మే 9: ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.


ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని.. మల్టీ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీఎం వెల్లడించారు. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. CURE, PURE, RAREగా అభివృద్ధిని మూడు భాగాలుగా విభజించుకున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు CURE ఏరియాను సర్వీస్ సెక్టార్‌గా గుర్తించామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట, రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న PURE ఏరియాను మాన్యూఫ్యాక్చర్ సెక్టార్‌గా గుర్తించామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న RARE ఏరియాను అగ్రికల్చర్ సెక్టార్‌గా గుర్తించామని అన్నారు.


తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు మన సంస్కృతికి అనుసంధానం చేయబోతున్నట్లు తెలిపారు. నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టీసీలో ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని అన్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ విడుదల

సీఎం రేవంత్‌కు పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు: హరీశ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2026 | 03:14 PM