ఏపీలో పెట్రోల్ బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష
ABN , Publish Date - Apr 25 , 2026 | 09:43 AM
ఏపీలో ఇంధన కొరతతో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూసివేత అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
అమరావతి, ఏప్రిల్ 25: రాష్ట్రంలో ఇంధన కొరతతో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూసివేత అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandababu Naidu) ఈరోజు(శనివారం) సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, వాహనదారులు, రైతుల ఇబ్బందులపై అధికారులతో సీఎం మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
ఇవి కూడా చదవండి...
ఏఐ భవితవ్యం.. అప్పటివరకూ జనాల జాబ్స్ సేఫ్!
రాత్రంతా పోలీసుల విచారణ.. సహకరించని అనంతబాబు
Read Latest AP News And Telugu News