Share News

28న పోలవరం నిర్వాసితులకు పట్టాల పంపిణీ

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:43 AM

పోలవరం తొలిదశ పనులు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తికానున్న నేపథ్యంలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాలని...

28న పోలవరం నిర్వాసితులకు పట్టాల పంపిణీ

  • రూ.85.03 కోట్ల విలువైన చెక్కులు అందించనున్న మంత్రి నిమ్మల

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): పోలవరం తొలిదశ పనులు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తికానున్న నేపథ్యంలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాలని జల వనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చాక మూడు దఫాలుగా దీపావళి, సంక్రాంతి, ఉగాది పర్వదినాల సమయంలో నిర్వాసితుల ఖాతాల్లో పరిహారాన్ని జమచేసింది. ఈక్రమంలోనే.. ఏలూరు జిల్లా కేఆర్‌పురం ఫేజ్‌-1బీ పునరావాసం కింద భూపట్టాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 28న మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహించనున్నారు. మొత్తం 14 గ్రామాలకు చెందిన 1241 నిర్వాసిత కుటుంబాలకు రూ.85.03 కోట్లు ఆర్‌అండ్‌ఆర్‌ నగదు చెల్లింపులు, ఇంటి స్థల పట్టాలు అందజేస్తారు.

Updated Date - Apr 25 , 2026 | 05:44 AM