Share News

Deputy CM Pawan: ఈ సంక్రాంతి సర్వైశ్వర్యం, సమృద్ధి ప్రసాదించాలి: డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Jan 14 , 2026 | 01:59 PM

తెలుగు ప్రజలందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రజలకు సర్వైశ్వర్యం, సమృద్ధి, శుభమంగళాలను ప్రసాదించాలని డిప్యూటీ సీఎం కోరారు.

Deputy CM Pawan: ఈ సంక్రాంతి సర్వైశ్వర్యం, సమృద్ధి ప్రసాదించాలి: డిప్యూటీ సీఎం పవన్
Deputy CM Pawan Kalyan

అమరావతి, జనవరి 14: రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి సౌభాగ్యాన్ని అందించాలని సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా పవన్ ఆకాంక్షించారు. సంక్రాంతి అనగానే మన మదిలో మెదిలేది.. భోగి మంటలు, గంగిరెద్దులు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, సంప్రదాయ పందేలు, కొత్త దుస్తులు, పిండి వంటలు అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పల్లెలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాకతో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రశాంతత వెల్లివిరుస్తోందన్న సంగతిని వేరే ప్రస్తావించవలసిన అవసరం లేనేలేదని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు.


శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఇటువంటి తరుణంలో జరుగుతున్న ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఇల్లూ సౌభాగ్యంతో విలసిల్లాలని పవన్ కోరారు. 'మహా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యాన్ని ప్రసాదించే ఈ సంక్రాంతి తెలుగు వారందరికీ సర్వైశ్వర్యం, సమృద్ధి, శుభమంగళాలను ప్రసాదించాలని ఆ సర్వేశ్వరుడిని వేడుకుంటున్నానని చెబుతూ.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు' అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.


భోగి భోగ, భాగ్యాలు అందించాలి: మంత్రి నిమ్మల

nimmala-ramanaidu-mlc.jpg

రాష్ట్ర ప్రజలకు భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu). రాష్ట్ర ప్రజలందరికీ భోగి భోగ, భాగ్యాలు అందించాలని ఆకాంక్షించారు. మన తెలుగు సంప్రదాయాలను యువత కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో గ్రామీణ ప్రాంతాలు సంక్రాంతి శోభతో విరాజిల్లుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన నుంచి విముక్తి పొంది నేడు సుఖ సంతోషాలతో ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాలనలో ఇరిగేషన్ రంగం గాడిలో పెట్టడంతో ప్రతి ఎకరానికి సాగు నీరందుతోందని తెలిపారు. ఇబ్బందులు లేని వ్యవసాయాన్ని అన్నదాతలు చేస్తున్నారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

భోగి వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన భారీ భోగి దండ

ఏపీ వ్యాప్తంగా అంబరాన్నంటిన భోగి సంబరాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 14 , 2026 | 03:38 PM