Share News

ఏపీ 12వ పీఆర్సీ కమిషనర్‌కు నెలకు రూ.2.25 లక్షల వేతనం.. ఉత్తర్వులు జారీ

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:46 PM

12వ వేతన సవరణ సంఘం కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది.

ఏపీ 12వ పీఆర్సీ కమిషనర్‌కు నెలకు రూ.2.25 లక్షల వేతనం.. ఉత్తర్వులు జారీ
Andhra Pradesh Government Orders

అమరావతి, నవంబర్ 24: 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌ను 12వ పీఆర్సీ కమిషనర్‌గా నియమించిన నేపథ్యంలో.. ఆయనకు చెల్లించాల్సిన వేతనం, ఇతర సదుపాయాలు, నియామక విధివిధానాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఉత్తర్వులు వెలువరించింది.


పీఆర్సీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్న దినేష్ కుమార్‌కు నెలకు రూ.2,25,000 ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేతనంపై కరువు భత్యం (డీఏ) వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే పునర్నియామక కాలంలో ఆయనకు అందే పెన్షన్‌పై డీఆర్ (DR) వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, అపెక్స్ స్కేల్‌ అధికారులకు వర్తించే తరహాలోనే పీఆర్సీ కమిషనర్‌కు హెచ్‌ఆర్‌ఏ (HRA), టీఏ, డీఏ సదుపాయాలను కల్పించనున్నారు. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పేరుతో సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది.

prc.jpg


ఇవి కూడా చదవండి...

ప్రతి ఇంటా పారిశ్రామికవేత్త ఉండాలన్నదే చంద్రబాబు ఆలోచన: గళ్లా మాధవి

గుడివాడలో వైసీపీ ప్రచారంలోకి ఒంటరిగా వెళ్లిన ఎమ్మెల్యే రాము.. జెండా తొక్కడంపై ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 04:05 PM