ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
ABN , Publish Date - Aug 06 , 2026 | 02:18 PM
ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, ఆగస్టు 06: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోఎంఎస్ నం.45కు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జి.ఓ.ఎం.ఎస్. నం.18ను విడుదల చేసింది. మోడల్ స్కూల్స్‌లోని ప్రతి ఉద్యోగికి ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మోడల్ స్కూల్స్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు
బోనాల వేడుకల్లో మహిళలకు వేధింపులు.. 678 మందిని గుర్తించిన షీటీమ్స్