Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌పై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం: ఎమ్మెల్సీ కోదండరాం

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:51 PM

పదవుల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి సరిగా లేదని ఎమ్మెల్సీ కోదండరాం పెదవి విరిచారు. పదవుల భర్తీ ఆలస్యం చేయడం వల్ల కలిగే ప్రయోజనం లేదన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌పై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం: ఎమ్మెల్సీ కోదండరాం
Prof kodandaram

హైదరాబాద్, ఆగస్టు 06: పదవుల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి సరిగా లేదని ఎమ్మెల్సీ కోదండరాం పెదవి విరిచారు. పదవుల భర్తీ ఆలస్యం చేయడం వల్ల కలిగే ప్రయోజనం లేదన్నారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగుల అంశంలో బీఆర్ఎస్ హయాంలో కంటే ఈ ప్రభుత్వంలో స్పందన బాగుందని రేవంత్ రెడ్డి సర్కారును ప్రశంసించారు.


ప్రభుత్వంలో తమ భాగస్వామ్యంపై సంప్రదింపులు చేస్తున్నామని వివరించారు. మాకు ఎమ్మెల్సీ, కార్పోరేషన్ చైర్మన్లు ఇస్తామన్నారని గుర్తు చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చిస్తున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఖరితో ఈ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ సర్ అని విద్యార్థులే ప్రకటించుకున్నారని ఎమ్మెల్సీ కోదండరాం వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నైనీ గని నుంచి ఎస్‌టీపీపీకి చేరిన తొలి బొగ్గు రైలు.. డిప్యూటీ సీఎం హర్షం

కర్నూలు బస్సు ప్రమాదం కేసు.. జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌‌ఆర్‌సీ నోటీసులు

For More TG News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 01:01 PM