నైనీ గని నుంచి ఎస్‌టీపీపీకి చేరిన తొలి బొగ్గు రైలు.. డిప్యూటీ సీఎం హర్షం
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:59 AM
మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP) కి ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు రావడం పట్ల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.
మంచిర్యాల, ఆగస్టు 6: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP) కి ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు రావడం పట్ల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. గురువారం ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు నైనీ బ్లాక్ నుంచి బొగ్గు లోడ్‌తో రైల్వే వ్యాగన్ వచ్చింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
దేశ అవసరాలకూ సింగరేణి బొగ్గు కీలకమని గుర్తు చేశారు. కొత్త కోల్ బ్లాకుల కోసం ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. సింగరేణిని కాపాడుకుంటామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. నైనీ గనుల నుంచి బొగ్గు రాకతో సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు ఆ కొరత తీరిందని వివరించారు. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP) కి రైలు వ్యాగిన్ చేరుకోగానే.. ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
59 బాక్స్ వ్యాగన్లలో మొత్తం 4,000 టన్నుల జీ-10 రకం బొగ్గు ఒడిశాలోని నైనీ గని నుంచి గురువారం ఉదయం జైపూర్‌కు చేరుకుంది. సింగరేణి కాలరీస్ నుంచి 136 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా రాష్ట్రం వెలుపల ఉన్న గని నుంచి బొగ్గు ఉత్పత్తిని సాధించి సొంత థర్మల్ ప్లాంట్‌కు రవాణా చేయడం ఇదే తొలిసారి.
ఈ వార్తలు కూడా చదవండి..
అరుణాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ భూకంపం
కర్నూలు బస్సు ప్రమాదం కేసు.. జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
For More TG News And Telugu News