Share News

అమరావతిలో జస్టిస్‌ సిటీ ఏర్పాటుకు సహకరిస్తాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 01 , 2026 | 08:26 PM

రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడమే మధ్యవర్తిత్వం (ఆర్బిట్రేషన్) విజయానికి ఉదాహరణ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

అమరావతిలో జస్టిస్‌ సిటీ ఏర్పాటుకు సహకరిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడ, మార్చి 01: రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడమే మధ్యవర్తిత్వం (ఆర్బిట్రేషన్) విజయానికి ఉదాహరణ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ వేదికగా జరిగిన ఆర్బిట్రేషన్ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో జస్టిస్‌ సిటీ ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. విజయవంతమైన మధ్యవర్తిత్వానికి గౌరవ వేతనం ఇస్తామన్నారు.


అమరావతిలో జ్యుడీషియల్‌ అకాడమీ, ఇంటర్నేషనల్‌ లా కౌన్సిల్‌కు సహకరిస్తామని పేర్కొన్నారు. అమరావతిలో మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. అమరావతిని 'బ్లూ-గ్రీన్‌' సిటీగా నిర్మాణం చేస్తామని ప్రకటించారు. ఈ రోజు (ఆదివారం) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాజధాని అమరావతిలోనే ఉన్నారన్నారు. ఆయన ఇక్కడ ఉండడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.


జస్టిస్ సూర్యకాంత్.. ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ఇక్కడికి వచ్చారని తెలిపారు. రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరించారు. రాజధాని అమరావతిని గొప్ప నగరంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిలో నివసించే వారు 20 ఏళ్లు ఎక్కువగా జీవిస్తారన్నారు.


2047 నాటికి భారత్‌ నెంబర్‌వన్‌ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. మన దేశానికి యువత, టెక్నాలజీ పెద్ద బలమని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు అభివర్ణించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మీడియేషన్ అనేది ఇండియా డీఎన్ఏలోనే ఉంది: సీజేఐ

పోలీస్ కమిషనర్‌పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 01 , 2026 | 08:37 PM