Share News

రిపోర్టర్ పూర్ణకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ఘన నివాళి

ABN , Publish Date - Mar 20 , 2026 | 02:45 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ పూర్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. శుక్రవారం పటమట లంక నుంచి శ్మశానవాటిక వరకు ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించారు.

రిపోర్టర్ పూర్ణకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ఘన నివాళి

అమరావతి, మార్చి 20: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ పూర్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. శుక్రవారం పటమట లంక నుంచి శ్మశానవాటిక వరకు ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించారు. అంతకముందు రిపోర్టర్ పూర్ణ భౌతికకాయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సందర్శించి నివాళులర్పించారు.


Bhanu-prakesh.jpg

రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్, బొండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జనసేన నేత అమ్మిశెట్టి వాసుతో పాటు జర్నలిస్టు సంఘాల నేతలు ఐవీ సుబ్బారావు, ఐజేయూ నేత సోమసుందర్, వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు తదితరులు పూర్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు.


Purna.jpg

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరోలో సీనియర్ రిపోర్టర్‌గా కేసంనేని పూర్ణచంద్రరావు(పూర్ణ) విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన గురువారం(19-03-2026) మృతి చెందారు. పూర్ణ స్వస్థలం గుంటూరు జిల్లా రేవేంద్రపాడు. ప్రస్తుతం విజయవాడలోని పటమటలో ఆయన నివసిస్తున్నారు. పూర్ణ మృతి పట్ల సీఎం చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ముసలం?

For More AP News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 04:05 PM