ఇరాన్‌పై అణు యుద్ధాన్ని నేనే ఆపా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 31 , 2026 | 10:39 AM
ఇరాన్‌పై అణు యుద్ధం జరగకుండా తానే అడ్డుకున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు రోజుల పాటు విస్తృత చర్చలు జరిపి అందరినీ ఒప్పించానని వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఇరాన్‌పై అణు యుద్ధం జరిగే పరిస్థితులు నెలకొన్నాయని.. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 25న ప్రపంచ శాంతి సభ నిర్వహించినట్లు డాక్టర్ కేఏ పాల్ తెలిపారు. ఐదు రోజులుగా విస్తృతంగా చర్చలు, మంతనాలు జరిపి అందరినీ ఒప్పించానని, అణు యుద్ధం జరగకుండా ఆపగలిగానని పేర్కొన్నారు. యుద్ధాల వల్ల కొందరికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని.. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల వెనుక ఏడుగురితో కూడిన 'గ్యాంగ్ ఆఫ్ సెవెన్' ఉందని ఆరోపించారు.
యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేఏ పాల్ అన్నారు. ఇరాన్ యుద్ధం వల్లే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిని తెరవగలిగిన ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తుతం తనతో పాటు కూర్చుని ఉన్నారని వ్యాఖ్యానించారు. మార్చి నుంచి అమెరికాలోనే ఉంటూ ముఖ్యంగా ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. యుద్ధం ఆగకపోతే కోట్లాది మందికి ఆహారం కూడా దొరకని పరిస్థితి వస్తుందని కేఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!
మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు
For More AP News And Telugu News