ట్రామాడోల్ దుర్వినియోగంపై ముమ్మర తనిఖీలు.. ఐదుగురి అరెస్ట్
ABN , Publish Date - Sep 15 , 2026 | 08:44 PM
మెడికల్ షాపుల్లో అధిక డోస్ గల పెయిన్ కిల్లర్ మాత్రల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 15: పారసిటమాల్ వంటి తక్కువ డోస్ గల మాత్రలకు బదులుగా అవసరం ఉన్నా.. లేకపోయినా.. ఎక్కువ డోస్ గల ట్రామాడోల్ వంటి పెయిన్ కిల్లర్లను మెడికల్ షాప్ యజమానులు ప్రజలకు అంటగడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక డోస్ గల ట్రామాడోల్ మాత్రల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆరోగ్య మంత్రి వై. సత్యకుమార్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సుమారు 100 మెడికల్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులో సగం కన్నా ఎక్కువ షాపుల్లో అంటే 55 షాపుల్లో ట్రామాడోల్ మాత్రలను దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘిసున్న షాపులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కాగా.. జంగారెడ్డి గూడెంలో ఓ మెడికల్ షాపులో ట్రామాడోల్ ఇంజెక్షన్లను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఆళ్ల నాని మృతిపై సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి
Read Latest AP News And Telugu News