Share News

ఆళ్ల నాని మృతిపై సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

ABN , Publish Date - Sep 15 , 2026 | 03:00 PM

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆళ్ల నాని మృతిపై సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి
CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 15: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ఆళ్ల నాని మృతిపై సంతాపం తెలియజేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని(కాళీ కృష్ణ శ్రీనివాస్) హఠాన్మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 56 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో దూరమవ్వడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఆళ్ల నాని ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.


ఆళ్ల నాని మృతిపై మంత్రి లోకేశ్

టీడీపీ నేత, మాజీ మంత్రి, ‘ఆళ్ల నాని’ గుండెపోటుతో మృతి చెందారనే సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాలకు దూరంగా, అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే నాని స్మృతిలో నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎక్స్‌లో లోకేశ్ పోస్ట్ చేశారు.


ఆళ్ల నాని మృతిపట్ల పవన్ విచారం..

Pawan Kalyan

ఏలూరు మాజీ ఉపముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత ఆళ్ల నాని ఆకస్మిక మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఏలూరు ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు, ఒకసారి ఎమ్మెల్సీగా ప్రజలకు నాని సేవలందించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చూకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. నాని కుటుంబసభ్యులకు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


దిగ్భ్రాంతికి గురయ్యా: పల్లా శ్రీనివాస రావు

palla-srinivas-tdp.jpg

ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని) ఆకస్మికంగా మృతి చెందారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఎన్నో సేవలు ప్రజలకు అందించారని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు పల్లా శ్రీనివాస్ ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.


ఏపీకి నాని చేసిన సేవలు చిరస్మరణీయం: విజయసాయి రెడ్డి

vijaya-sai-reddy-1.jpg

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతిపట్ల మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలియజేశారు. ఆళ్ల నాని రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విజయసాయి రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 03:39 PM