Share News

రాజధాని అమరావతిపై రేపు హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Sep 24 , 2026 | 09:48 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మూడు రాజధానుల బిల్లును సవాలు చేసిన రాజధాని రైతులు ఈ కేసు వేశారు.

రాజధాని అమరావతిపై రేపు హైకోర్టులో విచారణ

ఇంటర్‌నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మూడు రాజధానుల బిల్లును సవాలు చేసిన రాజధాని రైతులు ఈ కేసు వేశారు.


రైతుల పిటిషన్ పై అప్పట్లో జస్టిస్ జీకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి, రాజధాని అమరావతే అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. తీర్పు అమలు కోసం అప్పటి ధర్మాసనం కంటిన్యూస్ మాండమస్ విధించింది. ఈ తీర్పు అమలుకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా.. రాజధాని అమరావతే అంటూ అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును నాటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్

సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టు: హరీశ్ రావు

Read Latest TG News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 10:05 PM